హిమాయత్‌సాగర్‌,ఉస్మాన్‌సాగర్‌ లకు వరద

ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశంలోతట్టు ప్రాంతాలు అప్రమత్తం విధాత:వారంపదిరోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తి జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట)లు నిండుకుండల్లా మారాయి. హిమాయత్‌సాగర్‌ పూర్తిగా నిండడంతో ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశముంది. దీంతో ఈసీ, మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్‌సాగర్‌ పూర్తిగా నిండేందుకు మరో 5 అడుగుల దూరంలో ఉంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆదివారం గ్రేటర్‌వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. […]

హిమాయత్‌సాగర్‌,ఉస్మాన్‌సాగర్‌ లకు వరద

ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశం
లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

విధాత:వారంపదిరోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తి జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట)లు నిండుకుండల్లా మారాయి. హిమాయత్‌సాగర్‌ పూర్తిగా నిండడంతో ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశముంది. దీంతో ఈసీ, మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్‌సాగర్‌ పూర్తిగా నిండేందుకు మరో 5 అడుగుల దూరంలో ఉంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆదివారం గ్రేటర్‌వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కుండపోతతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. అత్యధికంగా పాతబస్తీ బహుదూర్‌పురాలో 5 సెం.మీలు, అత్యల్పంగా తిరుమలగిరి, కాకతీయహిల్స్‌లలో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాగల మూడురోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం (ఫుల్‌ ట్యాంకు లెవల్‌) 1763.50 అడుగులు (2.97 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం (ఫుల్‌ ట్యాంకు లెవల్‌) 1762.25 అడుగులకు చేరింది. ప్రస్తుతం 1388 క్యూసెక్‌ల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. వరదనీటి ప్రవాహం ఇలానే కొనసాగితే.. మిగిలిన 1.25 ఫీట్ల నీటిమట్టం కూడా అర్ధరాత్రి వరకు చేరే అవకాశం ఉందని జలమండలి అధికారులు అంచ‌నా వేస్తున్నారు. గత ఏడాది కూడా భారీ వర్షాల కారణంగా అక్టోబర్‌లో 13 గేట్ల ద్వారా నీటిని వదిలిపెట్టారు.

హిమాయత్‌సాగర్‌ ప్రత్యేకతలు…
పరీవాహక ప్రాంతం 505 చదరపు మైళ్లు
వాస్తవ సామర్థ్యం 1763.50 అడుగులు(2.97 టీఎంసీలు)
ప్రస్తుత సామర్థ్యం 1762.25 అడుగులు
ప్రస్తుత ఇన్‌ఫ్లో 1388 క్యూసెక్‌లు
ఇన్‌ఫ్లో ఛానెల్‌ వెంకటాపూర్‌ మొయిన్‌ రివర్‌ కోర్సు, దిండి సుల్తాన్‌పల్లి, అమ్థాపూర్‌

గేట్లు ఎత్తిన సంవత్సరాలు…
తొలుత 1981, 1982, 1983, 1988, 1989, 1990, 1991, 1998, 2001, 2010 తరువాత సరిగ్గా పదేండ్ల తర్వాత మళ్లీ 2021లో గేట్లు ఎత్తారు. ఈ సంవత్సరం జూలై నెలలోనే గేట్లు ఎత్తి ఈసీ నది ద్వారా మూసీ నదిలోకి వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉస్మాన్‌సాగర్‌ ప్రత్యేకతలు
పరీవాహక ప్రాంతం 246 చదరపు మైళ్లు ( 637 చ.కి.)
గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1790.00 అడుగులు (3.90 టీఎంసీలు)
ప్రస్తుతం 1784.60 అడుగులు
చెక్‌ డ్యాం వికారాబాద్‌ సాకరవాగు, ఎర్రగూడ విలేజ్‌
రెయిన్‌ ఫాల్‌ గేజ్‌ బుల్కాపూర్‌, జువ్వాడ, ఉస్మాన్‌సాగర్‌
గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1790 అడుగులు (దాటితే గేట్లు ఎత్తివేత)

గేట్లు ఎత్తిన సంవత్సరాలు
1981, 1983, 1988, 1989, 1990, 1996, 1998, 2000, 2010 తరువాత 2020లో గేట్లు ఎత్తారు. ప్రస్తుతం 1784.60 అడుగుల మేర నీరు ఉండగా, ఇన్‌ఫ్లో ఆగిందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. అయితే మరో 5.4అడుగులకు చేరితే గేట్లు ఎత్తుతామని, మరోభారీ వాన పడితే సులభంగానే ఉస్మాన్‌సాగర్‌లో నీరు గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని అధికారులు అంటున్నారు.