మధుయాష్కీతో టికెట్ దక్కని మాజీ ఎంపీల సమావేశం

విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని మాజీ ఎంపీలు సురేష్ షట్కర్, రాజయ్యలు మధుయాష్కీ ఇంట్లో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టికెట్ ఇవ్వక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీ కోసం పని చేసిన సీనియర్లకు టికెట్ ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టినట్లు సమాచారం.