షాద్ నగర్‌లో బీఆరెస్‌కు బిగ్ షాక్

  • Publish Date - October 20, 2023 / 11:46 AM IST

విధాత : షాద్‌ నగర్‌ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కోరుట్ల కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రాహుల్ గాంధీ సమక్షంలో ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు కేశం పేట జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి, ఫరూఖ్ నగర్ జడ్పీటీసీ వెంకట్ రాం రెడ్డి , మాజీ జడ్పీటీసీ మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, షాద్ నగర్ కౌన్సిలర్ శ్రావణి, మైనారిటీ నాయకుడు జమ్రత్ ఖాన్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్ లు కాంగ్రెస్‌లో చేరారు.