పచ్చని చెట్లు…ప్రగతికి మెట్లు : పచ్చదనం..స్వచ్ఛదనంలో మండలి చైర్మన్ గుత్తా

పచ్చని చెట్లు -ప్రగతికి మెట్లు అని, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరం బాధ్యతాయుతంగా మొక్కలను పెంచాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

పచ్చని చెట్లు…ప్రగతికి మెట్లు : పచ్చదనం..స్వచ్ఛదనంలో మండలి చైర్మన్ గుత్తా

విధాత, హైదరాబాద్ : పచ్చని చెట్లు -ప్రగతికి మెట్లు అని, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరం బాధ్యతాయుతంగా మొక్కలను పెంచాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం చిట్యాల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన పచ్చదనం స్వచ్చదనం కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి ,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొని, పట్టణ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మొక్కలను నాటడం వలన భావి తరాలకు ఎంతో మేలును చేసినవాళ్ళం అవుతామని చెప్పారు. అలాగే మన ఇంటిని ,చుట్టూ పక్కల ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నాకెందుకు ,నా ఇల్లు బాగుంటే చాలు అనే వైఖరితో అందరం నష్టపోతామని ఆయన చెప్పారు. గ్రామాలు -పట్టణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని లక్ష్యంతో నేటి నుండి నిర్వహిస్తున్న స్వచ్ఛత -పరిశుభ్రత అనే కార్యక్రమం గొప్ప కార్యక్రమము అని వివరించారు. ఈ స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు , ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు ,స్థానిక ప్రజా ప్రతినిధులు , స్థానిక నేతలు , ఉద్యోగులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.