నాపై పోటీకి నువ్వేరా: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు. దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
విధాత, హైదరాబాద్ : సిద్దిపేటలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిన రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయనే నాపై పోటీకి రావాలని మాజీ మంత్రి టి.హరీశ్ రావు సవాల్ విసిరారు. తలకిందులుగా తప్పస్సు చేసినా.. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాలేరు అని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన గెలిచేది బీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు. ఎప్పుడు గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన హరీశ్ రావు మాట్లాడారు. అసెంబ్లీ నడిపించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, అసెంబ్లీ సభా నియమాలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. చనిపోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు చెక్ ఇచ్చేందుకు 3 గంటలు సభను వాయిదా వేయడం విడ్డూరం అన్నారు .ప్రతి రోజు జీరో అవర్ తీసుకుంటామని చెప్పి, రెండు రోజుల నుంచి జీరో అవర్ తీసుకోవడం లేదు అని మండిపడ్డారు.
దక్షిణాదిపై కేంద్రం చిన్నచూపు
సౌత్ ఇండియాకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ తక్కువగా వస్తున్నాయని, కేంద్రానికి దక్షిణ భారత రాష్ట్రాల పట్ల చిన్నచూపు ఉంది, ఇదే విషయాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తూనే ఉంది అన్నారు. డిలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాము అని, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభమేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు కాబట్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెవులో పూలు పెట్టుకోని నిరసన తెలియజేశామని, ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించే వాళ్ళం కదా అని చెప్పుకొచ్చారు. ఇంకో వారం రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పొడిగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అన్నారు. అన్ని అంశాలపై చర్చ జరగాలంటే మరో వారం రోజుల పాటు అసెంబ్లీ జరగాలి అని డిమాండ్ చేశారు. ఈరోజు రెండు ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని కేటీఆర్ అడిగిన ప్రశ్నకు, 16 నోటిఫికేషన్‌లు, 16,978 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం సమాధానం చెప్పింది అని, బీఆర్ఎస్ హయంలో ఇచ్చిన ఉద్యోగాలు 50,785 మందికి నియామక పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటుంది అని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసింది , నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు.
కేటాయింపులు ఘనం..ఖర్చు నామమాత్రం
, వెల్ఫేర్ బోర్డ్స్ కార్పొరేషన్‌లపై స్పష్టత ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లుగా హరీశ్ రావు తెలిపారు. 33 కార్పొరేషన్లకు , 16 కార్పొరేషన్లకే కార్యాలయాలు ఉన్నాయి అని సమాధానం ఇచ్చారు అని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో రజక ఫెడరేషన్‌కు రూ. 386 కోట్లు పెట్టి, రూ. 1 కోటి ఖర్చు చేసినట్లు సమాధానం చెప్పారు అని, నాయి బ్రాహ్మణలకు రూ. 280 కోట్లు పెట్టి, 30 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు అని వెల్లడించారు. మున్నూరు కాపులకు రూ 100 కోట్లు కేటాయించి , ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదు, కృష్ణ బలిజలకు (పూసల) రూ. 100 కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదు, ఆర్యవైశ్యులకు రూ. 25 కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి ఖర్చు చెయ్యలేదు, బీసీ కార్పోరేషన్‌కు రూ. 1,370 కోట్లు పెట్టి, రూ. 6 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారని తెలిపారు. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ. 2,730 కోట్లు పెట్టి, రూ. 52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 5,403 కోట్లు పెట్టి, రూ. 74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అని హరీశ్ రావు ఆరోపించారు. 98 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి మళ్ళించారు అని, బీసీ, ఎస్సీ , ఎస్టీలకు కేటాయించిన నిధులను 2 శాతం మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు చేసిందిని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Savitrii | మహానటి సావిత్రి జీవితంలో కీలక మలుపు … ప్రేమ, విజయం, విషాదం వెనుక అసలు కథ
బేగంపేట రన్‌వే కింద 6 లేన్ అండర్‌పాస్.. దేశంలోనే తొలి ప్రయోగం!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram