రుణమాఫీపై హైకోర్టులో మాజీమంత్రి హరీష్‌రావు పిటిషన్
రుణమాఫీ కాని రైతుల తరఫున హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్ధిపేటలో వేలాది మందికి రుణమాఫీ కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
విధాత,హైదరాబాద్ : రుణమాఫీ కాని రైతుల పక్షాన బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీష్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఎన్నికలలో ఇచ్చిన మాట తప్పింది అని,
సిద్ధిపేట నియోజకవర్గంలో 22,849 మందికి రుణమాఫీ కాలేదని హరీష్‌రావు పిటిషన్ లో ఆరోపించారు. కేవలం 47 శాతం మంది రైతులకే రుణమాఫీ చేశారు అని, రుణమాఫీపై రేవంత్‌కు ఎన్ని లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో పిటిషన్ దాఖలు చేసినట్లుగా సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం 2023అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆరుగ్యారంటీల హామీలలో భాగంగా రూ.2లక్షల రైతు రుణమాఫీ (డిసెంబర్ 9, 2023 నాటికి వర్తింపు) చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను ఎంపిక చేసి నిబంధనల మేరకు రూ.2లక్షల రుణమాఫీ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. సుమారు 25 లక్షల మందికి పైగా రైతులకు రూ.20,616 కోట్లకు పైగా రుణమాఫీ చేసినట్లుగా వెల్లడించింది. ఈ ప్రక్రియలో సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని అర్హులైన రైతుల వివరాలను పరిశీలించి, వారికి కూడా న్యాయం చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అయితే రుణామాఫీ పూర్తిగా అమలు చేయలేదని, సగం మందికే చేశారని, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో కూడా రుణమాఫీ పూర్తిగా అమలు జరుగలేదంటూ బీఆర్ఎస్ వాదిస్తుంది. రుణమాఫీ అంశంపై ఇప్పటిదాక ప్రభుత్వంపైన విమర్శలు చేసిన హరీశ్ రావు తాజాగా హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి :
ఇకపై మంచివాడిగా ఉండను.. ఫోటోతో ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ ఉద్యోగుల బకాయిలు రూ.1000కోట్లు విడుదల!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram