Liquor Party | లిక్క‌ర్ పార్టీకి అనుమ‌తి తీసుకోవ‌డం ఎలా..? ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

Liquor Party | మీరు మీ ఇంట్లో కానీ, ఇత‌ర ప్రాంతాల్లోని ఏదైనా లిక్క‌ర్ పార్టీ( Liquor Party ) నిర్వ‌హించాల‌నుకుంటున్నారా..? ఆల్క‌హాల్( Alcohol ) కూడా స‌ర్వ్ చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఈ పార్టీల‌కు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రా..? మ‌రి అనుమ‌తి ఎవ‌రి నుంచి తీసుకోవాలి..? ఎవ‌రికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి..? అనే విష‌యాల‌ను ఈ స్టోరీలో వివ‌రంగా తెలుసుకుందాం.

Liquor Party | లిక్క‌ర్ పార్టీకి అనుమ‌తి తీసుకోవ‌డం ఎలా..? ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

Liquor Party | అక్ర‌మ మ‌ద్యం( Illegal Alcohol ) అమ్మ‌కాలు, ర‌వాణా, ఉత్ప‌త్తి వంటి అంశాల‌పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ( Excise Department ) ఉక్కుపాదం మోపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో లిక్క‌ర్ పార్టీ( Liquor Party ) నిర్వ‌హించాలనుకుంటే త‌ప్ప‌నిస‌రిగా అనుమ‌తి తీసుకోవాల్సిందే. అనుమ‌తి తీసుకోకుండా లిక్క‌ర్ పార్టీ నిర్వ‌హిస్తే క‌ట‌క‌ట‌లాపాలు కావాల్సిందే. కాబ‌ట్టి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి లిక్క‌ర్ పార్టీల‌కు అనుమ‌తి తీసుకోవాలి.

ఆరు ఫుల్ బాటిల్స్, 12 బీర్ల వ‌ర‌కు అనుమ‌తి అక్క‌ర్లేదు..

తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్( Telangana Excise Act ), 1968 ప్ర‌కారం.. ఆరు ఫుల్ బాటిల్స్( Full Bottles ), 12 బీర్ల( Beers ) వ‌ర‌కు వినియోగిస్తే పోలీసుల అనుమ‌తి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఆరు ఫుల్ బాటిల్స్, 12 బీర్ల కంటే ఎక్కువ మ‌ద్యాన్ని వినియోగించే సంద‌ర్భం వ‌స్తే.. త‌ప్ప‌నిస‌రిగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమ‌తి తీసుకోవాలి.

లిక్క‌ర్ పార్టీకి అనుమ‌తి ఎలా తీసుకోవాలి..?

ఎక్సైజ్ శాఖ అఫిషియ‌ల్ వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అయి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు నింపాల్సి ఉంటుంది. సంబంధిత ఎక్సైజ్ స్టేష‌న్ హౌజ్ ఆఫీస‌ర్( Excise Station House Officer ) ప‌రిశీలించి, అనుమ‌తి ఇస్తారు. అయితే ఇంటితో పాటు స్టార్ హోట‌ల్స్( Star Hotels ), రిసార్ట్‌( Resort )ల‌లో నిర్వ‌హించే ప్ర‌తి లిక్క‌ర్ పార్టీ( Liquor Party ) కి అనుమ‌తి తీసుకోవాల్సిందే. లిక్క‌ర్ పార్టీకి అనుమ‌తి తీసుకునే వారు త‌ప్ప‌నిస‌రిగా తేదీ, ఆర్గ‌నైజ‌ర్ మొబైల్ నంబ‌ర్, ఈమెయిల్ అడ్ర‌స్ త‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

లిక్క‌ర్ పార్టీల‌కు ఎంత మేర డ‌బ్బులు చెల్లించాలి..?

జీహెచ్ఎంసీ( GHMC )తో పాటు 5 కిలోమీట‌ర్ల రేడియ‌స్‌లో నిర్వ‌హించే పార్టీల‌కు ఒక్క రోజుకు రూ. 12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఫోర్ స్టార్స్( Four Stars ), ఖ‌రీదైన హోట‌ల్స్‌( Luxury Hotels )లో నిర్వ‌హించే లిక్క‌ర్ పార్టీ( Liquor Party ) ల‌కు రూ. 20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో లిక్క‌ర్ పార్టీలు నిర్వ‌హిస్తే రూ. 9 వేలు చెల్లించాలి. స్పోర్ట్స్, క‌మర్షియ‌ల్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈవెంట్లు నిర్వ‌హిస్తే వెయ్యి మంది వ‌ర‌కు రూ. 50 వేలు, 5 వేల వ‌ర‌కు రూ. ల‌క్ష‌, 5 వేల మందికి పైగా రూ. 2.50 ల‌క్ష‌లు చెల్లించాలి. ఈ పార్టీల‌కు సంబంధించి ఇత‌ర స‌మాచారం కావాలంటే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ టోల్ ఫ్రీ నంబ‌ర్ 18004252523 ను సంప్ర‌దించాలి.

లిక్క‌ర్ పార్టీల అనుమ‌తి కోసం సంద‌ర్శించాల్సిన‌ వెబ్‌సైట్ ఇదే.. excise.telangana.gov.in