హైడ్రా ..రూ.80 వేల కోట్ల విలువైన భూములను కాపాడింది: రంగనాథ్
హైడ్రా ఇప్పటివరకు 2093 ఎకరాలను ఆక్రమణల చెర నుంచి కాపాడింది అని, మొత్తంగా రూ.80 వేల కోట్ల విలువ చేసే భూములను కాపాడటం జరిగిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు
విధాత, హైదరాబాద్ : హైడ్రా ఇప్పటివరకు 2093 ఎకరాలను ఆక్రమణల చెర నుంచి కాపాడింది అని, మొత్తంగా రూ.80 వేల కోట్ల విలువ చేసే భూములను కాపాడటం జరిగిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐలాపూర్‌లో కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేశాం అని, ఎఫ్ టీఎల్(FTL)పరిధిలో ఉన్న కొన్ని విల్లాలు తీసేసాం అని తెలిపారు.
ఆక్రమణల తొలగింపుల కోసం చాలా మంది పేదవాళ్లు మమ్మల్ని వచ్చి కలిశారు అని, 1200 ఇళ్లను ఏ మాత్రం టచ్ చేయలేదు అని తెలిపారు. చెరువుల పునరుద్ధరణలో ఇళ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
బతుకమ్మ కుంట భూ హక్కులపై ఎడ్ల సుధాకర్ రెడ్డి చేస్తున్న వాదన అసంబద్దంగా ఉందని, 1970లో సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం బతుకమ్మ కుంట 10 ఎకరాల్లో విస్తరించి ఉందని స్పష్టమవుతుందని మ్యాప్ లతో పాటు వెల్లడించారు. 1990నాసా శాటిలైట్ ఇమేజ్ కూడా బతుకమ్మ కుంట స్పష్టంగా ఉందని తెలిపారు. దానిని తర్వాత ఆక్రమించారని, సుధాకర్ రెడ్డి తన వాదనలో కూడా 2003లో రూ.30లక్షల ఖర్చుతో వేల లారీల మట్టితో చదును చేసుకున్నామని పేర్కొనడం కూడా అక్కడ కుంట ఉందనడానికి నిదర్శనం అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మేం ప్రస్తుతానికి బతుకమ్మ కుంట వద్ద ఫెన్సింగ్ లు, బోర్డులు, గోడలు తొలగించామని, అక్కడి పరిస్థితులు, మా వాదనలపై కోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తాం అని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram