కాంగ్రెస్‌కు శాసనసభలో ఎప్పుడైనా సభ్యులు తక్కువ అయితే మద్దతు ఇస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం బయటకు వస్తున్న క్రమంలో తీన్మార్ మల్లన్నతో సంభాషణలో భాగంగా మల్లారెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు.
మేడ్చల్ నుంచి మల్లన్న పోటీ చేసి ఉంటే ఎవరో ఒక మల్లన్న అసెంబ్లీకి వచ్చి ఉండేవారన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎలా ఉందనగా ఆయనకు నాకు మంచి మిత్రుడని మల్లారెడ్డి చెప్పారు.
అయితే శాసన సభలో సభ్యులు తక్కువైతే ప్రభుత్వానికి మద్దతునిస్తావా అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా ఖచ్చితంగా ఇస్తానని మల్లారెడ్డి తెలిపారు. ఎన్నికల అప్పుడే రాజకీయాలు తర్వాత అందరం ఒక్కటేనంటూ అక్కడి నుంచి మల్లారెడ్డి ముందుకు కదిలారు.