CM Revanth Reddy | జయశంకర్..గద్దర్‌లకు సీఎం రేవంత్‌రెడ్డి నివాళులు
తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, ప్రజాయుద్దనౌక గద్దర్ వర్ధంతి పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి వారికి నివాళులర్పించారు. అమెరికా పర్యటలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా వారికి నివాళులర్పించారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి, ప్రజాయుద్దనౌక గద్దర్ వర్ధంతి పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి వారికి నివాళులర్పించారు. అమెరికా పర్యటలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా వారికి నివాళులర్పించారు. ఉచ్ఛ్వాస నుండి నిశ్వాస వరకు ఆయన నరనరాన ప్రవహించిన ప్రాణం తెలంగాణ అంటూ ప్రొఫెసర్ జయ శంకర్ సారు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నానని రేవంత్‌రెడ్డి ట్వీట్‌లో పేర్కోన్నారు. అలాగే మరో ట్వీట్‌లో పాటకు పోరాటం నేర్పి తన గళంలో తూటాగా మార్చి అన్యాయం పై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నానని రేవంత్‌రెడ్డి తెలిపారు. గద్దర్‌తో తాను గతంలో వివిధ సందర్భాల్లో భేటీయైన ఫోటోలు రేవంత్‌రెడ్డి ట్వీట్‌లో పోస్టు చేశారు.