కవిత టీఆర్ఎస్ జోరు.. మే 20 నుండి జెండా పండుగ

కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన పార్టీ మే 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగలను నిర్వహించాలని నిర్ణయించింది.

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నూతనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్)” పార్టీ విస్తరణకు వేగంగా ముందుకెలుతుంది. టీఆర్ఎస్ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు..పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు నెల రోజుల పాటు వాడవాడనా టీఆర్ఎస్ జెండా పండుగలు నిర్వహించవలసిందిగా పార్టీ శ్రేణులకు కవిత నిర్దేశించారు. ఇందులో భాగంగా మే 20 నుండి జూన్ 20 వరకు రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించడం జరుగుతుంది.

అలాగే పార్టీ ఆవిర్భావ సభలో తెలిపిన పార్టీ విధానాలను, పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించవలసిందిగా పార్టీ నాయకులను కార్యకర్తలకు కవిత సూచించారు. నేడు తెలంగాణ ఎదుర్కుంటున్న అనేక సమస్యలపైన ఎక్కడికక్కడ గళమెత్తవలసిందిగా పార్టీ నాయకులను కార్యకర్తలకు ఇప్పటికే కవిత మార్గదర్శకం చేశారు. అందులో భాగంగా రాష్ట్రస్థాయి అంశాలతో పాటు స్థానిక సమస్యల పట్ల కూడా పార్టీ శ్రేణులు స్పందించడం, అవసరమైన చోట ఉద్యమించడం చేయాలని సూచించారు.

టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా కార్యకర్తలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ కావలసిన అవసరం ఉందని కవిత తెలిపారు. సమాజం పట్ల భాద్యత, అంకితభావం కలిగిన చురుకైన కార్యకర్తలతో కలిసి సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని, రాజకీయ చైతన్యం నిండిన ఒక బలమైన జన సమూహాన్ని ప్రజా ఉద్యమాల కోసం నిర్మించాలని పార్టీ కేడర్ కు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

జపాన్‌లో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందో తెలిస్తే షాకే..
బండి భగీరథ్‌పై కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

Latest News