విధాత, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మితకు సంబంధించిన వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించారు. పార్టీ అంతర్గత అంశాలపై నేను బహిరంగ మాట్లాడలేనని, అయితే సుస్మిత వ్యాఖ్యలు, సురేఖ వివరణలకు సంబంధించి పార్టీ క్రమశిక్షణ కమిటీ, ఏఐసీసీ పరిశీలిస్తుందని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ, అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నాయకులైనా, కార్యకర్తలైనా ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఉండాల్సిందేఅని ఆయన తేల్చిచెప్పారు.
పార్టీలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యం అని, అదే సమయంలో ఏవైనా సమస్యలు లేదా అభిప్రాయాలు ఉంటే పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
