కాంగ్రెస్ అసమర్ధ పాలనతోనే కర్ణాటక రైతులకు కరెంటు కష్టాలు: మంత్రి కేటీఆర్

  • Publish Date - October 21, 2023 / 11:24 AM IST

విధాత : కాంగ్రెస్ అస‌మ‌ర్థత వ‌ల్లే క‌ర్ణాట‌క‌లో క‌రెంట్ క‌ష్టాలు ఏర్ప‌డ్డాయ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌గినంత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డంలో విఫ‌ల‌మైనందునే, అక్కడి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల‌కు కాంగ్రెస్ పార్టీ అస‌మ‌ర్థ‌త గురించి తెలుస‌ని, ద‌శాబ్దాలుగా ఆ బాధ‌లు ఎదుర్కొన్నార‌ని, ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో రైతులు ఆ బాధ‌లు అనుభ‌విస్తున్నార‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.

కర్నాటక ప్రభుత్వం రైతాంగానికి కరెంటు ఇవ్వడానికి నానా తంటాలు పడుతోందని, వ్యవసాయ రంగానికి సరిపడా విద్యుత్‌ సరఫరా చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని రైతులు మండిపడుతున్నారన్నారు. యాద్గిర్‌లో ఏడు గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన ఘటనను పేర్కోంటు మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.