అభివృద్ధిని చూసి ఆదరించండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • Publish Date - October 18, 2023 / 10:01 AM IST

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఆదరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజలను కోరారు. జిల్లాకేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తన హయాంలో చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో ప్రజల సహకారం ఎంతో ఉన్నదని అన్నారు. పాలమూరు పట్టణ సుందరీకరణకు కృషి చేశామని, ప్రతి చౌరస్తాను అందంగా కన్పించే విధంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.


ఈ సందర్భంగా హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ నాయకులు ఎండీ సాబ్, తైసిల్, బషీర్, ముస్తఫా, రాంరెడ్డి, భానుప్రకాష్, కర్రె రాంచంద్రయ్య, బాబు, బీఎస్పీకి చెందిన తిరుమలయ్య, శ్రీనయ్య, చెన్నయ్య, ఎర్రోళ్ల కృష్ణయ్యతో పాటు సుమారు 150 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై తాము పార్టీ చేరినట్లు నాయకులు తెలిపారు.