ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి: పెద్దపల్లి అదనపు కలెక్టర్ అరుణ

  • Publish Date - October 20, 2023 / 01:00 PM IST

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జే అరుణశ్రీ పిలువు నిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయం నుండి గోదావరి ఖని చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం నిర్వహించిన సభలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని అన్నారు.


పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. నీతి, నిజాయితీగా ఓటు వేయడంతో పాటు ఇతరులు కూడా వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.


ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ సీ హెచ్ నాగేశ్వర్, స్వీప్ నోడల్ ఆఫీసర్ రవూఫ్ ఖాన్, డీఆర్డీఓ శ్రీధర్,డిప్యూటీ కమిషనర్ త్రియoబకేశ్వర్ రావు, ఎస్ఇ చిన్నా రావు, సూపరింటెండెంట్ మనోహర్, మెప్మా పీడీ అర్బన్ రజనీ, ఐసీడీఎస్‌ సీడీపీఓ స్వరూప, రామగుండం, అంతర్గాం,పాలకుర్తి మండల తహసీల్దార్లు, అంగన్వాడీ , మెప్మా సీఓలు, ఆర్పీలు,మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.