8 మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌.. టీఎస్‌పీఏ జేడీగా రంగనాథ్‌

  • Publish Date - October 20, 2023 / 01:09 PM IST

విధాత : ఇటీవల బదిలీయైన 8మంది ఐపీఎస్‌లకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పోస్టింగ్‌లు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ కమిషనర్ స్థానం నుంచి బదిలీయైన రంగనాథ్‌ను టీఎస్‌పీఏ జాయింట్ డైరక్టర్‌గా నియమించారు.


రాజేంద్రప్రసాద్‌ను డిప్యూటీ జేడీగా నియమించారు. సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్‌రెడ్డి, గ్రేహౌండ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికాపంత్‌, ఈస్ట్ జోన్ డీసీపీ గా రోహిత్ రాజ్, ట్రాఫిక్ డీసీపీ గా ఆర్. వెంకటేశ్వర్లు, పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్‌లను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేశారు.