విధాత : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సాధారణ వ్యక్తిగా మారి ప్రజలతో మమేకమై సాగించిన పర్యటన ప్రజలను ఆకట్టుకుంది. కరీంనగర్ నుంచి శుక్రవారం బస్ లో జగిత్యాలకు బయలు దేరిన రాహుల్ జగిత్యాల జిల్లా మాల్యాల క్రాస్ రోడ్డు పక్కన కనిపించిన మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద ఆగి తానే స్వయంగా పెనంపై దోసె వేశారు. తాను తినడంతో పాటు వెంట ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి తినిపించారు.
నాలుగు దోసెలు వేసిన రాహుల్ తాను కూడా కార్యకర్తలతో కలసి టిఫిన్ చేశారు. ఈ సందర్బంగా టిఫిన్ సెంటర్ నిర్వాహకునితో ముచ్చటించారు. అక్కడే ఉన్న పిల్లలకు చాక్లెట్లు పంచారు. సరదా వారితో కాసేపు ముచ్చటించారు. దారి మధ్యలో గీతకార్మికులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కరీంనగర్‌లోని పడగల్, ఆర్మూర్ లో చాయ్ దుకాణంలలో కాసేపు మహిళలతో, స్థానికులతో సంభాషించారు.