తెలంగాణ పోలింగ్‌కు వరుణ గండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ప్రతికూలంగా కనిపిస్తుంది

తెలంగాణ  పోలింగ్‌కు వరుణ గండం

విధాత : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ప్రతికూలంగా కనిపిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నేడు గురువారం ఏపీ, తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది