Road Accident | పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సింగ‌రేణి ఉద్యోగి మృతి

Road Accident | పెద్ద‌ప‌ల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గోదావ‌రిఖ‌నిలోని రాజేశ్ థియేట‌ర్ వ‌ద్ద‌ వేగంగా దూసుకొచ్చిన కారు ర‌హ‌దారి ప‌క్క‌నున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.

Reported by: raj | తెలంగాణ‌ | Apr 04, 2026, 11:26 am IST
Read Time: 2 mins
Road Accident | పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సింగ‌రేణి ఉద్యోగి మృతి

Road Accident | పెద్ద‌ప‌ల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గోదావ‌రిఖ‌నిలోని రాజేశ్ థియేట‌ర్ వ‌ద్ద‌ వేగంగా దూసుకొచ్చిన కారు ర‌హ‌దారి ప‌క్క‌నున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న న‌లుగురిలో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుడిని సింగ‌రేణి ఉద్యోగి శ్రీధ‌ర్‌గా పోలీసులు గుర్తించారు. అతివేగ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు తేల్చారు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.