రోడ్డు ప్రమాదంలో కొండా సురేఖకు గాయాలు

  • Publish Date - October 19, 2023 / 08:44 AM IST

విధాత : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి కొండా సురేఖ స్కూటి నడుపుతూ అదుపు తప్పి కింద పడిపోగా తీవ్ర గాయాలకు గురైంది. ఆమెను వెంటనే సహచర నాయకులు ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై పడటంతో ఆమె తలకు, కణతకు గాయాలయ్యాయి. ప్రాణాపాయం లేనప్పటికి గాయల నొప్పి అధికంగా ఉండటంతో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.