విధాత : తెలంగాణ ఈఎన్సీ మరోసారి కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టులో చట్టవిరుద్ధంగా చేపట్టిన కొత్త కాంపోనెంట్స్‌కు ఆడ్మినిస్ట్రేటివ్ అనుమతిలివ్వవద్దని కోరింది.
ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ ముందు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం సాగుతుంది. మరోవైపు ట్రైబ్యూనల్‌కు అదనపు అధికారాలు కట్టబెట్టడాన్ని ఏపీ సుప్రీంలో కూడా సవాల్ చేసింది. తాజాగా తెలంగాణ కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ఫిర్యాదుతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదరనుంది.