విధాత, హైదరాబాద్ : తెలంగాణ సచివాలయాన్ని ప్రభుత్వం నో ఫ్లై జోన్ గా ప్రకటించింది. సచివాలయం చుట్టూ నో ఫ్లై జోన్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరియట్ పై, చుట్టూ డ్రోన్ ఎగరవేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
రాష్ట్ర సచివాలయంలో భద్రత పెంచేందుకు ఇప్పటికే కొత్త సీసీ కెమెరాలు అమర్చారు. మొత్తం 310 కెమెరాలు అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఇదివరకు ఉన్న 60 కెమెరాలకు అదనంగా 250 కొత్త కెమెరాలు జోడించి భద్రతా పర్యవేక్షణను మరింత పెంచారు. సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద, భద్రతపరమైన బెదిరింపు ఫోన్ల వంటి వాటి నేపథ్యంలో సచివాలయ భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (టీజీఎస్పీఎఫ్) పర్యవేక్షణలో నిఘా, భద్రత కొనసాగుతుంది. తెలంగాణ స్పెషల్ పోలీసులకు నుంచి తిరిగి టీజీఎస్పీఎఫ్ పరిధిలోకి సచివాలయం భద్రత విధులు వచ్చాక..214మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు.