Damodar Rajanarasimha : సీజనల్ కేసులు లేని తెలంగాణే లక్ష్యం

తెలంగాణలో సీజనల్ వ్యాధుల కేసులు తగ్గుముఖం మంత్రి దామోదర్ రాజనర్సింహా ముందస్తు నివారణ చర్యలతో నియంత్రణ క్రమంలో.

Damodar Rajanarasimha : సీజనల్ కేసులు లేని తెలంగాణే లక్ష్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 30(విధాత): హైదరాబాద్ లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం సీజనల్ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా పాల్గొన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శనను ఆయన పరిశీలించారు.

సీజనల్ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు మంత్రికి వివరించారు. గత సంవత్సరంతో పోలిస్తే సీజనల్ వ్యాధుల కేసులు తగ్గుముఖం పట్టాయని సమీక్షలో డైరెక్టర్ అఫ్ హెల్త్ డా. రవీందర్ కుమార్ వెల్లడించారు .

రాష్ట్రం లో ప్రజారోగ్య శాఖ సీజనల్ వ్యాధుల నిర్ములనలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్ల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

సీజనల్ వ్యాధుల కట్టడి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల్లో అవగాహనను కల్పించామని వెల్లడించారు. సీజనల్ కేసులు నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశించారు. రాష్ట్రం లో అన్ని ఆసుపత్రులలో సీజనల్ రోగాలకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డా . క్రిస్టినా జడ్ చోంగ్తూ , ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ceo ఉదయ్ కుమార్ , DME డా . నరేంద్ర కుమార్ , డైరెక్టర్ అఫ్ హెల్త్ డా . రవీందర్ కుమార్ , TVVP కమిషనర్ డా . అజయ్ కుమార్ , స్పెషల్ ఆఫీసర్ విమలా థామస్ లు పాల్గొన్నారు .