Telangana Weather Updates : తెలంగాలో కొనసాగనున్న వర్షాలు : వాతావరణ శాఖ

ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు ఈదురు గాలులతో వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Telangana Rains

విధాత, హైదరాబాద్ : దక్షిణ తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రఓణి ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో ఈదురు గాలులలో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతుందని, ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాదులో ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు పడుతాయని ధర్మరాజు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Pilot Rohith Reddy : వాట్ నెక్ట్స్ …. షోకాజ్ నోటీసులపై రోహిత్ రెడ్డి నో ఆన్సర్ !
CKYC | ఈ ఒక్క నంబర్ ఉంటే చాలు.. ప్రతిసారి ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్‌లతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనే ఉండదు!

Latest News