Telugu Thalli Flyover Renamed | తెలంగాణ తల్లిగా పేరు మారిన తెలుగు తల్లి ఫ్లైఓవర్

తెలుగు తల్లి ఫ్లైవోవర్ పేరు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారింది; సచివాలయం సమీపంలో మార్పు అధికారులు నిర్ణయం

Telugu Thalli Flyover Renamed | తెలంగాణ తల్లిగా పేరు మారిన తెలుగు తల్లి ఫ్లైఓవర్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పేర్ల మార్పు అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని తెలుగు తల్లి ఫ్లైవోవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చి బోర్డు ఏర్పాటు చేసింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం సమీపంలో ఈ ఫ్లైఓవర్ ఉంది. 2005 జనవరి 22న, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఆయనే దీనికి ‘తెలుగు తల్లి ఫ్లైఓవర్’ అనే పేరు పెట్టారు. ఇన్నాళ్లు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే పేరు మార్పు జరుగడం గమనార్హం.

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఎస్ పేరును టీజీగా మార్చింది. దీంతో వివిధ ప్రభుత్వ శాఖల పేర్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా టీఎస్ స్థానంలో ‘టీజీపీఎస్సీ’ తో పాటు ‘టీజీఆర్టీసీ’ పేర్లు వచ్చాయి. అలాగే తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసింది.