Telangana Gazetted Officers | టీజీఓ హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా వెంకట్ గూడూరి ఎన్నిక
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా వెంకట్ గూడూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం టీజీఓ భవన్ లో జరిగిన హైదరాబాద్ జిల్లా సమావేశంలో మొత్తం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు తెలిపారు

విధాత: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా వెంకట్ గూడూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం టీజీఓ భవన్ లో జరిగిన హైదరాబాద్ జిల్లా సమావేశంలో మొత్తం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు తెలిపారు. కార్యదర్శి నిరంజన్ రెడ్డి, ట్రెజరర్ స్వర్ణలత, అసోసియేట్ అధ్యక్షులు శిరీష, ఉపాధ్యక్షులు బాబుబేరి, లావణ్య, వినోద్ రెడ్డి, స్పోర్ట్ సెక్రటరీ వై. శ్రీనివాస్, ఆర్గనైజేషన్ సెక్రటరీ శివకుమార్, కల్చరర్ సెక్రటరీ యశోద, పబ్లిసిటీ సెక్రటరీ యాదగిరి, కార్యాలయ కార్యదర్శులు ప్రభాకర్ శ్రీ వాత్సవ, గంగిరెడ్డి, సహాయ కార్యదర్శలు ఎస్. వెంకటేశ్వర్లు, సముజ్వల, బి. వెంకటేశ్వర్లు, సైదులు, స్వరూప రాణి, కార్యవర్గ సభ్యులుగా నరసింహాచారి, వసుందర, లలిత, ఉమా రాణి, ఎస్. శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా ప్రతినిధి దీపారెడ్డి, సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు యాదగిరి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు క్రుష్ణా యాదవ్, మేడ్చల్ టీజీఓ అధ్యక్షులు శ్రీనివాస్ మూర్తి, నల్లగొండ జిల్లా కార్యార్శి ఎం, శ్రీనివాస్ లు, నాయకులు బాలకుమార్ లు ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.