విధాత : బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తే సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్ధమని, వ్యూహాత్మక నిర్ణయాలు ఎన్నడైనా పార్టీ నిర్దేశితమేనని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయ శాంతి పేర్కోన్నారు. బుధవారం ట్వీట్టర్ వేదికగా ఆమె సీఎం కేసీఆర్‌పై తన పోటీ అంశంపై స్పందించారు. బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదని కార్యకర్తల విశ్వాసమన్నారు.
బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదు.. అని కార్యకర్తల విశ్వాసం.
అందుకు, గజ్వేల్ నుండి బండి సంజయ్ గారు, కామారెడ్డి నుండి నేను అసెంబ్లీకి కేసీఆర్ గారిపై పోటీ చెయ్యాలని గత కొన్ని రోజుల మీడియా సమాచారం దృష్ట్యా, కార్యకర్తలు అడగటం తప్పు కాదు.
అసెంబ్లీ ఎన్నికల… pic.twitter.com/j1tUfexznX
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 17, 2023
గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి నేను అసెంబ్లీకి కేసీఆర్ పై పోటీ చెయ్యాలని గత కొన్ని రోజులుగా మీడియా కథనాల నేపధ్యంలో మా పార్టీ కార్యకర్తలు అడగటం తప్పు కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ నా ఉద్దేశ్యం కానప్పటికీ పార్టీ వ్యూహాత్మకంగా తీసుకునే నిర్ణయాల మేరకు పోటీకి సిద్ధమన్నారు.