Mayor Vijayalakshmi | అర్ధరాత్రి ఓ రౌడీషీటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంట్లో ప్రవేశించాడు. అంతటితో ఆగక ఏకంగా ఆమె గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో అతడు దురుసుగా ప్రవర్తించాడు. తాను మంచి వాడిని కాదని, తనకు నేర చరిత్ర ఉన్నదని, తన జోలికి రావద్దని సిబ్బందిని బెదిరించాడు.
Mayor Vijayalakshmi : అర్ధరాత్రి ఓ రౌడీషీటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంట్లో ప్రవేశించాడు. అంతటితో ఆగక ఏకంగా ఆమె గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో అతడు దురుసుగా ప్రవర్తించాడు. తాను మంచి వాడిని కాదని, తనకు నేర చరిత్ర ఉన్నదని, తన జోలికి రావద్దని సిబ్బందిని బెదిరించాడు.
తనకు ఓ సమస్య ఉందని, ఆ సమస్య చెప్పుకునేందుకే వచ్చానని చెప్పి హల్చల్ చేశాడు. దాంతో వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గత రాత్రి బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్లో మేయర్ విజయలక్ష్మి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు యూసఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్‌గా పోలీసులు గుర్తించారు.
అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మేయర్ విజయలక్ష్మి ఇంట్లో లేరని తెలుస్తోంది. ఆమె తండ్రి కేశవరావుకు ఇటీవలే మోకాలికి శస్త్రచికిత్స జరగడంతో ఆస్పత్రిలోనే ఉన్నట్లుగా సమాచారం. కాగా బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన కే కేశవరావు, ఆయన కుమార్తె, మేయర్ విజయలక్ష్మి ఇటీవలే ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.