Rashmika Mandanna | హీరోయిన్ కాస్త బిజీగా ఉందంటే ఆమె చుట్టూ తప్పుడు ప్రచారాలు మొదలైపోతాయి. అలాగే వాళ్ళ చుట్టూ చేరే జనం కూడా తెలియకుండా మోసగించడం అనేది సినీ జనాల్లో జరిగే మామూలు తంతే. అయితే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే విషయంలో సినీ తారలు ఎప్పుడూ తప్పులో కాలేస్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా ఇలాంటి అనుభవమే ఓ స్టార్ హీరోయిన్‌కి ఎదురైందట. విషయంలోకి వెళితే.. రష్మిక మందన్నా ‘పుష్ప’ మూవీతో ఓ రేంజ్లో దూసుకెళ్లిపోయింది. […]
Rashmika Mandanna |
హీరోయిన్ కాస్త బిజీగా ఉందంటే ఆమె చుట్టూ తప్పుడు ప్రచారాలు మొదలైపోతాయి. అలాగే వాళ్ళ చుట్టూ చేరే జనం కూడా తెలియకుండా మోసగించడం అనేది సినీ జనాల్లో జరిగే మామూలు తంతే. అయితే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే విషయంలో సినీ తారలు ఎప్పుడూ తప్పులో కాలేస్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా ఇలాంటి అనుభవమే ఓ స్టార్ హీరోయిన్‌కి ఎదురైందట. విషయంలోకి వెళితే..
రష్మిక మందన్నా ‘పుష్ప’ మూవీతో ఓ రేంజ్లో దూసుకెళ్లిపోయింది. తాజాగా నితిన్ హీరోగా చేస్తున్న మరో ప్రాజెక్ట్‌లో రష్మిక హీరోయిన్గా బుక్ అయ్యి, రెండు రోజులు షూటింగ్ కూడా చేసిన తర్వాత అందులోంచి అనివార్య కారణాలు వల్ల తప్పుకుంది. దీనిపై రష్మిక క్లారిటీ కూడా ఇచ్చింది.
ఆ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లనే వదులుకోవడం జరిగిందని చెప్పింది. కానీ అసలు విషయం అది కాదట.. ఇదంతా రష్మిక మేనేజర్ కిరణ్ వల్లనే అయిందట. అతగాడు రష్మికను మోసం చేసి 80 లక్షల వరకు కాజేశాడని, దాంతో అతన్ని తీసేశారనే ఇటీవల వార్తలు వచ్చాయి.
అయితే డబ్బు విషయమే కాకుండా, మేనేజర్ కిరణ్.. రష్మిక గురించి తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నాడట.. టాలీవుడ్ మీద ఆసక్తి లేక, బాలీవుడ్లో ఎదగాలని చూస్తుందంటూ దర్శక నిర్మాతల దగ్గర నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడట. ఇదంతా తెలిసి నెమ్మదిగా అతన్ని తప్పించిందట రష్మిక.
ఇలా చెప్పే ఆమెకు రెండు మూడు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం రాకుండా చేశాడనేలా టాక్ వినబడుతోంది. అలాగే ఆయన మేనేజర్‌గా ఉన్నప్పుడు డేట్స్ విషయంలో చూసుకో కుండా నితిన్ సినిమాకు కమిట్ అయిన రష్మిక.. అతని వెళ్లిపోయిన తర్వాత కానీ అసలు క్లాష్ విషయం తెలియలేదట. అందుకే ఆ సినిమా నుంచి రష్మిక తప్పుకుందని అంటున్నారు.
అంతా తన మాజీ మేనేజర్ కిరణ్ చేసిన పనే అని టాక్. పైకి మాత్రం ఏమీ లేదు.. ఇద్దరం పైకి ఎదగాలనే నిమిత్తమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్నా ‘పుష్ప2, యానిమల్’ చిత్రాల షూటింగ్స్‌లో బిజీగా ఉంది.
‘రెయిన్బో’ టైటిల్‌తో శాకుంతలం ఫేమ్ మోహన్ దేవ్‌తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఏది ఏమైనా నమ్మకంగా పక్కన చేరి పనిచేస్తున్న వారు, డబ్బు పరంగానే కాకుండా, చెడ్డ పేరు తేవడం అంటే అది చిన్న విషయం కాదు. పాపం ఎలా తట్టుకుందో మరి.