Samantha | సినిమాలకు సమంత బ్రేక్ అందుకే.. క్లారిటీ కూడా వచ్చేసింది

Samantha | ‘ఊ అంటావా మావ, ఊ ఊ అంటావా’ అని ‘పుష్ప’ మూవీతో కుర్రకారుకి కిక్కెక్కించినా, ‘శాకుంతలం’ సినిమాలో పౌరాణికంగా కనిపించినా అది సమంతకే చెల్లింది. తన వైవిధ్యమైన నటనతో సినీ ఇండస్ట్రీలో నెగ్గుకువస్తున్న సమంత చుట్టూ ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూ వచ్చాయి.. వస్తున్నాయి. తాజాగా సమంత ఆరోగ్యం అంత సవ్యంగా లేకపోవడం కూడా వార్తల్లోకి ఎక్కి వైరల్ అయింది. ‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్న సమంత కొంత కాలంగా కాస్త డల్ గానే ఉంది. […]

Samantha | సినిమాలకు సమంత బ్రేక్ అందుకే.. క్లారిటీ కూడా వచ్చేసింది

Samantha |

‘ఊ అంటావా మావ, ఊ ఊ అంటావా’ అని ‘పుష్ప’ మూవీతో కుర్రకారుకి కిక్కెక్కించినా, ‘శాకుంతలం’ సినిమాలో పౌరాణికంగా కనిపించినా అది సమంతకే చెల్లింది. తన వైవిధ్యమైన నటనతో సినీ ఇండస్ట్రీలో నెగ్గుకువస్తున్న సమంత చుట్టూ ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూ వచ్చాయి.. వస్తున్నాయి. తాజాగా సమంత ఆరోగ్యం అంత సవ్యంగా లేకపోవడం కూడా వార్తల్లోకి ఎక్కి వైరల్ అయింది.

‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్న సమంత కొంత కాలంగా కాస్త డల్ గానే ఉంది. అయినా చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసేసి, కొత్త ఆఫర్స్ ఏం ఒప్పుకోవడం లేదని, కొంతకాలం పాటు విరామం తీసుకోబోతుందనే వార్తలు ఈమధ్య వినిపిస్తున్న తరుణంలో తాజాగా సమంత చికిత్స కోసం అమెరికా వెళ్ళబోతుందంటూ వచ్చిన వార్తలు ఈ మాటను నిజం చేస్తున్నాయి.

సమంత సినిమాలను వదిలేసే ఆలోచనలో ఉందనే వార్తలు కూడా జోరుగానే వ్యాపిస్తున్న సమయంలో.. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం రాకపోవడంతో అభిమానుల్లో ఇది నిజమా, కాదా అనే సందేహాలు కూడా కలిగాయి. అయితే సమంత స్నేహితుడు రోహిత్ బత్కర్ దీని మీద క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో సమంతకు విదేశాల్లో ట్రీట్మెంట్ జరిగే విషయం నిజమేనని తెలిపాడు.

రోహిత్ బత్కర్ సెలెబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్‌గా ఉంటూ, సమంతకు కూడా అతనే పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంది. ఇదే విషయంగా సమంత చికిత్సకు దేవుడు శక్తిని, మనోధైర్యాన్ని ఆమెకు ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా రోహిత్ సమంతకు విశెష్ తెలిపాడు. తను ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌తో సమంత అమెరికా ప్రయాణం నిజమేనని ఖరారైంది.

ఇప్పటికే సిటాడెల్, ఖుషి షూటింగ్స్ పూర్తి చేసింది. వీటి తర్వాత మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటుందనే ప్రచారం తప్పితే ఇప్పటి వరకూ దీని మీద క్లారిటీ కూడా రాలేదు. కాకపోతే అమెరికాలో చికిత్స తర్వాత కొద్దిరోజులు అక్కడే ఉండాలనుకోవడం వల్లనే ఇలా మరో సినిమా ఒప్పు కోవడం లేదనే విషయానికి రోహిత్ బత్కర్ పోస్ట్‌తో క్లారిటీ వచ్చినట్లయింది.

ఏదేమైనా సమంత త్వరలోనే పూర్తి ఆరోగ్యంతోనే తిరిగి రావాలని కోరుకుందాం. తాజాగా ఆమె యోగ చేస్తున్న పిక్ పెట్టి.. ఇందులో ఉన్న ప్రశాంతత మరెక్కడా లేదనేలా రాసుకొచ్చింది. ఆమె చేసిన ఆ పోస్ట్‌పై ఇప్పుడు మరింతగా చర్చలు మొదలయ్యాయి.

ఇక సమంత విజయ్ దేవరకొండతో జంటగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకుడు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఆ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ నడుస్తుంది. ఇదే కాకుండా సిటాడెల్ ఇంటర్నేషనల్ యాక్షన్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇండియన్ వెర్షన్‌లో సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించారు.