ఇక.. నా శ్వాస ఉన్నంత వరకు కేసీఆర్‌తోనే: దాసోజు శ్రవణ్‌

విధాత: బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రావణ్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పు కున్నారు. ఈ సందర్భంగా దాసోజు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఏప్రిల్ 12. 2014 ఆవేశంతోనో, అనాలోచితంగానో ఆ రోజు నేను కన్నతల్లి లాంటి నాకు రాజకీయంగా సామాజికంగా అస్థిత్వాన్ని ఇచ్చి గుర్తింపు ఇచ్చి నన్ను సమాజంలో ప్రజలకు దగ్గర తెచ్చిన టీఆర్‌ఎస్‌ను వీడి ఆ రోజు వేరే పార్టీలో జాయిన్ అయ్యాను. దాదాపు […]

ఇక.. నా శ్వాస ఉన్నంత వరకు కేసీఆర్‌తోనే: దాసోజు శ్రవణ్‌

విధాత: బీజేపీకి రాజీనామా చేసిన దాసోజు శ్రావణ్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పు కున్నారు. ఈ సందర్భంగా దాసోజు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…

ఏప్రిల్ 12. 2014 ఆవేశంతోనో, అనాలోచితంగానో ఆ రోజు నేను కన్నతల్లి లాంటి నాకు రాజకీయంగా సామాజికంగా అస్థిత్వాన్ని ఇచ్చి గుర్తింపు ఇచ్చి నన్ను సమాజంలో ప్రజలకు దగ్గర తెచ్చిన టీఆర్‌ఎస్‌ను వీడి ఆ రోజు వేరే పార్టీలో జాయిన్ అయ్యాను.

దాదాపు ఏడు సంవత్సరాల ఎనిమిది నెలల తర్వాత నా సొంత ఇంటికి మళ్లీ రమ్మని నన్ను ఆహ్వానించి, సాదరంగా, ప్రేమగా, మా కుటుంబంలో ఒక సభ్యుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని చెప్పి ప్రేమతో ఆహ్వానం పలికినటువంటి మా అన్న రామన్నకు హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

వాస్తవానికి నేను ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాన్ని. ప్రజారాజ్యం పార్టీ తర్వాత, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక ఫినిక్స్ బర్డ్ వలే పార్టీని పునర్ నిర్మిస్తూ ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా, కెరటంలా తీర్చిదిద్దుతున్న వైనాన్ని చూసి ప్రేరణ పొంది తెలంగాణ ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ అడుగుల్లో అడుగులేసి, తెలంగాణ ఉద్యమంలో మమేకమై పని చేశాను.

ఉద్యమంలో కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని, ఉద్యమానికి ఒక గొంతుకగా పని చేసే అవకాశం కలిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా పని చేసే అవకాశం కల్పించారు.కేసీఆర్ నేతృత్వంలో, దేశానికే తలమానికంగా తెలంగాణ తీర్చిదిద్దబడ్డది.

మోడల్ డెవలప్‌మెంట్‌ను తెలంగాణ దేశానికి చూపుతోంది. దేశ వ్యాప్తంగా నిరూపయోగంగా ఉన్న వనరులన్నీ కూడా మళ్లీ వినియోగించబడాలి. మొత్తం భారతదేశం కూడా సమగ్రమైన అభివృద్ధి చెందాలని, వినూత్నమైన ఆలోచనలతో, దార్శనికతతో కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి అని జాతీయ పార్టీని ఆవిష్కరించారు.

ఈ తరుణంలో వారితో కలిసి నడవాలని, నవ భారత నిర్మాణం కోసం కేసీఆర్ పడుతున్న శ్రమలో ఉడుతా భక్తిగా నేను కూడా పనిచేయాలని బీఆర్‌ఎస్‌లో చేరాను. ఇందుకు అవకాశం కల్పించిన కేసీఆర్‌, కేటీఆర్‌ లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బీజేపీలోకి వెళ్లిన రెండున్నర నెలల్లోనే బయటకు ఎందుకు వచ్చాడని సందేహం ఉండొచ్చు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో బీజేపీలోకి వెళ్లాం. అక్కడ మూస బోసిన రాజకీయాలు కనబడ్డాయి.

మునుగోడు ఉప ఎన్నిక వేళ అక్కడ కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు ప్రాతినిధ్యం వహించేలా బీజేపీ క్షుద్ర రాజకీయం కొనసాగుతున్న వైనాన్ని చూసిన తర్వాత, బలహీన వర్గాల నాయకులకు పార్టీలో స్థానం లేదని కలత చెంది, పార్టీకి రాజీనామా చేశా. మరోసారి సొంత ఇంటికి వచ్చిన నేను భవిష్యత్‌లో నాకు శ్వాస ఉన్నంత వరకు, సామాజికంగా అస్థిత్వం కలిగించి, ప్రజలకు దగ్గరకు చేర్చి తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా తీర్చిదిద్దిన కేసీఆర్‌కు అండగా ఉంటూ, వారి అడుగుల్లో అడుగులేస్తూ నవ భారత నిర్మాణం కోసం పని చేస్తాను.