కాంగ్రెస్ అసంతృప్తులకు బుజ్జగింపు భేటీ

విధాత, నల్గొండ: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో టికెట్ ఆశించి నిరాశపడిన చల్లమల్ల కృష్ణా రెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, పున్న కైలాశ్‌లను బుజ్జగించేందుకు టీపీసీసీ నాయకత్వం నేడు శనివారం గాంధీభవన్‌లో భేటీ కానున్నారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఆధ్వర్యంలో జరుగనున్న ఈ ఈ సమావేశానికి టికెట్ ఆశించిన నేతలతో పాటు జిల్లా కాంగ్రెస్ సీనియర్లు కూడా పాల్గొననున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి, మధు యాష్కీ, కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు […]

కాంగ్రెస్ అసంతృప్తులకు బుజ్జగింపు భేటీ

విధాత, నల్గొండ: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో టికెట్ ఆశించి నిరాశపడిన చల్లమల్ల కృష్ణా రెడ్డి, పల్లె రవికుమార్ గౌడ్, పున్న కైలాశ్‌లను బుజ్జగించేందుకు టీపీసీసీ నాయకత్వం నేడు శనివారం గాంధీభవన్‌లో భేటీ కానున్నారు.

ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఆధ్వర్యంలో జరుగనున్న ఈ ఈ సమావేశానికి టికెట్ ఆశించిన నేతలతో పాటు జిల్లా కాంగ్రెస్ సీనియర్లు కూడా పాల్గొననున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి, మధు యాష్కీ, కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఈ భేటీకి హాజరు కానున్నారు.

ఈ భేటీకి టికెట్ ఆశించి భంగపడిన వారిలో ఎవరెవరు వస్తారో రారో అన్న సందేహాలు నెలకొనగా ఈ విషయమై ఆ పార్టీ కేడర్లో ఆసక్తి కర చర్చ సాగుతుంది.