ఎమ్మెల్యే భాస్కరరావుకు చేదు అనుభవం.. అడ్డుకున్న వీఆర్ఏలు
విధాత, నల్గొండ: మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కరరావును వీఆర్ఏలు అడ్డుకొని నిరసన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో వీఆర్ఏలు ఆత్మహత్యలకు వైపు సాగుతున్నారని, విఆర్ఏల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించాలని నిలదీశారు.

విధాత, నల్గొండ: మిర్యాలగూడ మండలం ఉట్లపల్లిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కరరావును వీఆర్ఏలు అడ్డుకొని నిరసన తెలిపారు.
తమ సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో వీఆర్ఏలు ఆత్మహత్యలకు వైపు సాగుతున్నారని, విఆర్ఏల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహించాలని నిలదీశారు.