చెన్నై: అమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం

విధాత: తమిళనాడు దివంగత సీఎం జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లకు విశేష ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ తక్కువ ధరకే టిఫిన్లు, భోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అంది స్తోంది. మద్రాస్‌ వరకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఖర్చును భరిస్తోంది. వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న పేదల నుంచి డబ్బు తీసుకో వద్దని, ఉచితంగానే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉచితంగానే సరఫరా చేయాలని పేర్కొంది. అమ్మ క్యాంటీన్లలో ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం, […]

చెన్నై: అమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం

విధాత: తమిళనాడు దివంగత సీఎం జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లకు విశేష ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ తక్కువ ధరకే టిఫిన్లు, భోజనాలను రాష్ట్ర ప్రభుత్వం అంది స్తోంది. మద్రాస్‌ వరకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఖర్చును భరిస్తోంది.

వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న పేదల నుంచి డబ్బు తీసుకో వద్దని, ఉచితంగానే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉచితంగానే సరఫరా చేయాలని పేర్కొంది. అమ్మ క్యాంటీన్లలో ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం వడ్డిస్తారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తరవాత కూడా అమ్మ పేరుతోనే క్యాంటీన్లను కొనసాగిస్తోంది.