వైయస్ షర్మిలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు.. ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు?
వైయస్ షర్మిలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య తదితరుల ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రిపై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ సందర్భంగా స్పీకర్ నోటీసుకు తీసుకొచ్చారు. చట్టసభల ప్రతినిధులు అనే స్పృహ లేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేవిధంగా అవమానిస్తున్నదని, తద్వారా ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల యొక్క హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు చేసినందుకు, […]

వైయస్ షర్మిలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య తదితరుల ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రిపై, మంత్రులపై, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ సందర్భంగా స్పీకర్ నోటీసుకు తీసుకొచ్చారు.
చట్టసభల ప్రతినిధులు అనే స్పృహ లేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేవిధంగా అవమానిస్తున్నదని, తద్వారా ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల యొక్క హక్కులకు, గౌరవానికి భంగం కలిగించినందుకు, నిరాధార ఆరోపణలు చేసినందుకు, జుగుప్సాకర ఆరోపణలు చేసినందుకు ఫిర్యాదు చేసినట్లు వారు మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణిస్తామని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తానని స్పీకర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.