తగ్గిన కరోనా కేసులు
విధాత: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా 11,65,286 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,516 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 13,155 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. గత ఏడాది ప్రారంభం నుంచి 3.44 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. వారిలో 3.38 కోట్ల మంది వైరస్‌ను జయించారు. కొద్దికాలంగా క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నా యి. ప్రస్తుతం 267 రోజుల కనిష్ఠానికి […]

విధాత: దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. తాజాగా 11,65,286 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,516 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 13,155 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
గత ఏడాది ప్రారంభం నుంచి 3.44 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. వారిలో 3.38 కోట్ల మంది వైరస్‌ను జయించారు. కొద్దికాలంగా క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నా యి. ప్రస్తుతం 267 రోజుల కనిష్ఠానికి చేరి.. 1,37,416కి తగ్గాయి. క్రియాశీల రేటు 0.40 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.26 శాతానికి పెరిగింది.
కేరళ గతంలో సంభవించిన కరోనా మరణాల లెక్కలను సవరిస్తోంది. దాంతో మృతుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 501 మరణాలు నమోదుకాగా.. అందులో 419 కేరళ నుంచి వచ్చినవే. ఇప్పటి వరకు 4,62,690 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మరోపక్క నిన్న 53,81,889 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 110 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.