పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపించండి: సీఎం కేసీఆర్
విధాత: పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపించాలని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్లాలని సీఎం కేసీఆర్ పార్లమెంట్ సభ్యులకు సూచించారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆదివారం పార్లమెంట్ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని, కనీస మద్దతు ధర చట్టం, […]

విధాత: పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపించాలని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్లాలని సీఎం కేసీఆర్ పార్లమెంట్ సభ్యులకు సూచించారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆదివారం పార్లమెంట్ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని, కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ చట్టం రద్దు కోసం పోరాడాలని ఆదేశించారు. అలాగే కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం పట్టుబట్టాలని తెలిపారు. తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్రం చేసిందేమీ లేదని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై ప్రశ్నించాలని సూచించారు.