పబ్‌లపై ఎన్ని కేసులు పెట్టారు.. తెలంగాణ హైకోర్టు సీరియస్‌

విధాత: నగరంలో నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ధ్వని నియంత్రణకు సంబంధించి సమయ పరిమితి, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. జనావాసాల మధ్య పబ్‌లలో మితిమీరిన ధ్వని, డ్యాన్సుల హోరు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా యన్న పిటిషన్లపై గత కొంత కాలంగా విచారిస్తున్న ఉన్నత న్యాయస్థానం.. తాజాగా మరోసారి […]

పబ్‌లపై ఎన్ని కేసులు పెట్టారు.. తెలంగాణ హైకోర్టు సీరియస్‌

విధాత: నగరంలో నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై ఎన్ని కేసులు పెట్టారో చెప్పాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ధ్వని నియంత్రణకు సంబంధించి సమయ పరిమితి, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

జనావాసాల మధ్య పబ్‌లలో మితిమీరిన ధ్వని, డ్యాన్సుల హోరు, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా యన్న పిటిషన్లపై గత కొంత కాలంగా విచారిస్తున్న ఉన్నత న్యాయస్థానం.. తాజాగా మరోసారి విచారణ జరిపింది. మద్యం, ఆహార పదార్థాల పంపిణీకి మాత్రమే ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చినప్పటికీ.. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి వరకు డీజేలు, డ్యాన్సులు నిర్వహిస్తున్నారని పిటిషనర్లు వాదించారు.

మూడు కమిషనరేట్ల పరిధిలో ఎన్ని పబ్‌లు ఉన్నాయి? వాటిలో మ్యూజిక్, డ్యాన్సుల నిర్వహణకు అనుమతి ఉన్నవి ఎన్నో వివరాలు ఇవ్వాలని సీపీలను హైకోర్టు ఆదేశించింది. పబ్‌లకు ట్రేడ్ లైసెన్సు మంజూరు చేసేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారో చెప్పాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను ఈన ఎల 26కి వాయిదా వేసింది