ఆరోపణలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్‌గా మారింది: మంత్రి జగదీశ్ రెడ్డి
విధాత, నల్లగొండ: ముఖ్యమంత్రిపై, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్‌గా మారిందని, గవర్నర్ తీరు సరైంది కాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. నిత్యం వార్తల్లో ఉండేదుకు గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారని, రాజ్ భవన్‌ను ఉపయోగించుకుని గవర్నర్ బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ బద్ధ సంస్థలను గౌరవించడంలో కేసీఆర్ వంటి పరిణితి చెందిన నాయకుడు మరొకరు లేరన్నారు. గౌరవంగా రాజ్ భవన్‌ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి […]

విధాత, నల్లగొండ: ముఖ్యమంత్రిపై, ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్‌కు ఫ్యాషన్‌గా మారిందని, గవర్నర్ తీరు సరైంది కాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. నిత్యం వార్తల్లో ఉండేదుకు గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారని, రాజ్ భవన్‌ను ఉపయోగించుకుని గవర్నర్ బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
రాజ్యాంగ బద్ధ సంస్థలను గౌరవించడంలో కేసీఆర్ వంటి పరిణితి చెందిన నాయకుడు మరొకరు లేరన్నారు. గౌరవంగా రాజ్ భవన్‌ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశంలో ప్రధాని, రాష్టపతి తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలన సాగుతుందన్నారు.
గవర్నర్ హోదాకు తగినట్లు ప్రవర్తించాలి
గవర్నర్ తమిళిసై గారి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తమిళిసై హోదాకు తగినట్లు ప్రవర్తించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 ఏళ్లు పోరాడి సాధించిన రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేస్తున్నారన్నారు.
గత మూడేళ్లలో గవర్నర్ గా మీరు సందర్శించిన ప్రాంతాలకు కేంద్రం నుండి తీసుకువచ్చిన నిధులు ఎన్ని ? మీరు సమస్యలు ఉన్నాయని వెళ్లిన ప్రాంతాలలో ఎన్ని సమస్యలు పరిష్కరించారు?గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్దమైన హోదా.. దానిని మీరు హుందాగా ఉపయోగించుకోవాలని, దేశంలో గవర్నర్ పదవి వార్షికోత్సవం నిర్వహించుకున్న ఏకైక గవర్నర్ తెలంగాణ గవర్నర్ గా మీరు మాత్రమే నిలుస్తారన్నారు.
దక్షిణాది రాష్ట్రాల సమావేశాలకు హాజరు కావడం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతం, వారి బదులు హోంమంత్రి హాజరయ్యారు,దానిని ప్రశ్నించడం గవర్నర్ గా మీకు తగదని, రాష్ట్ర సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ అవగాహన ఉన్నన్నారు.
గవర్నర్ గా రాష్ట్ర సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రానికి అధిక నిధులు తెస్తే సంతోషిస్తామని, కేవలం గవర్నర్ గా అధికారం ప్రదర్శించాలనుకోవడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.