విధుల్లో చేరండి..18న సీఎస్‌తో సమావేశంలో నిర్ణయం:మంత్రి కేటీఆర్ సూచన
సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న కేటీఆర్ విధాత, హైదరాబాద్: ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు వెంటనే విధుల్లో చేరాలని మంత్రి కేటీఆర్ వీఆర్ఏ ప్రతినిధులకు సూచించారు. ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ సమావేశమై వాళ్ళ సమస్యలు, ప్రధాన డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు. వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని, డిమాండ్లపైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలు […]

- సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న కేటీఆర్
విధాత, హైదరాబాద్: ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు వెంటనే విధుల్లో చేరాలని మంత్రి కేటీఆర్ వీఆర్ఏ ప్రతినిధులకు సూచించారు. ఆందోళన చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ)లతో అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ సమావేశమై వాళ్ళ సమస్యలు, ప్రధాన డిమాండ్లు అడిగి తెలుసుకున్నారు.
వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నదని, డిమాండ్లపైన ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో వీఆర్ఏలు తమ ఆందోళనలను విరమించి విధుల్లో చేరాలని కోరారు.

17వ తేదీన జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు ముగిసిన అనంతరం 18వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ తమను పిలిచి తమ వాదన వినడం పట్ల వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు.