దమ్ముంటే కేసీఆర్ నాపై పోటీ చేయాలి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
విధాత, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల నియంత పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికని, దమ్ముంటే కేసీఆర్ తనపై పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు. మునుగోడు ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను గెలిపిస్తే ప్రజా తీర్పును అవమానిస్తూ నియోజకవర్గ సమస్యలపై నివేదించేందుకు ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదన్నారు. సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల తప్ప సీఎం కేసీఆర్ […]

విధాత, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల నియంత పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికని, దమ్ముంటే కేసీఆర్ తనపై పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు.
మునుగోడు ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను గెలిపిస్తే ప్రజా తీర్పును అవమానిస్తూ నియోజకవర్గ సమస్యలపై నివేదించేందుకు ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదన్నారు.
సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల తప్ప సీఎం కేసీఆర్ ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవట్లేదని అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కి ఉద్యమ ద్రోహులకు పెద్దపీఠ వేసి రాష్ట్రంలో నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ ను గద్దె దించడం బీజేపీకే సాధ్యమన్నారు.
మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేసీఆర్ కుటుంబం పాలనకు వ్యతిరేకంగా ఉప ఎన్నికల సిద్ధమయ్యానన్నారు. గతంలో టీఆర్ఎస్‌లో చేరమని,మంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ చెప్పినా తాను వెళ్లలేదన్నారు.
18 నెలలసమయం ఉన్న మునుగోడు అభివృద్ధి కోసం రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ప్రజల మేలు కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పుకు సిద్ధపడ్డానన్నారు. మునుగోడు ప్రజలు తనను గెలిపించి రాష్ట్రంలో ధర్మంతో కూడిన రాజకీయాలకు బాటలు వేయాలన్నారు. ఈ సందర్భంగా గుడాపూర్, కొరటికల్, చీకటి మామిడి, కొంపల్లి గ్రామాల నుంచి పలువురు బీజేపీలో చేరారు.