వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. కేటీఆర్‌తో VRAల భేటి.. డిమాండ్లకు ఓకే?

విధాత, హైదరాబాద్: అసెంబ్లీ హాల్‌లో మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో వీఆర్‌ఏల ప్రతినిధి బృందం భేటీ అయింది. పే స్కేల్‌తో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని గత నెల రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. కొంత ఉద్రిక్తతకు దారి తీయడంతో మంత్రి కేటీఆర్ వాళ్లతో చర్చలు జరిపారు. దాదాపు 20 మంది VRAలతో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి […]

వీఆర్ఏల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. కేటీఆర్‌తో VRAల భేటి.. డిమాండ్లకు ఓకే?

విధాత, హైదరాబాద్: అసెంబ్లీ హాల్‌లో మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో వీఆర్‌ఏల ప్రతినిధి బృందం భేటీ అయింది. పే స్కేల్‌తో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని గత నెల రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. కొంత ఉద్రిక్తతకు దారి తీయడంతో మంత్రి కేటీఆర్ వాళ్లతో చర్చలు జరిపారు. దాదాపు 20 మంది VRAలతో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అయితే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాలతో పాటు మరింత స్పష్టత రావాల్సి ఉంది. అంతకు ముందు వీఆర్‌ఏ చేసిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. VRAలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున వీఆర్ ఏలు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది.