Paruchuri: రాకేష్ మాస్టర్‌ని.. అలా వదిలేసి వినోదం చూశారంతే..

Paruchuri ఇప్పటి దర్శకులైనా రాకేష్ మాస్టర్‌కి అవకాశాలు ఇచ్చి ఉండాల్సింది. విధాత‌: మనిషి ఉన్నప్పుడు విలువ తెలుసుకోక.. పోయాక అయ్యోపాపం అనే రోజులివి. ఆస్తి, అంతస్తులు అన్నీ ఉన్నా, అదే తంతు.. ఏమీ లేని వాడు విషయంలోనూ అదే తంతు అన్నట్టు ఉంది కాలం. ఎవరి గోల వారిదే అన్నట్టు ఉన్నాయి ఇప్పటి రోజులు. సామాన్యులనే కాదు.. సెలబ్రిటీల విషయంలోనూ అదే జరుగుతుంది. ఈమధ్యనే చనిపోయిన రాకేష్ మాస్టర్ విషయంలోనూ అదే జరిగింది. అతని పొడ గిట్టలేదు.. […]

Paruchuri: రాకేష్ మాస్టర్‌ని.. అలా వదిలేసి వినోదం చూశారంతే..

Paruchuri

  • ఇప్పటి దర్శకులైనా రాకేష్ మాస్టర్‌కి అవకాశాలు ఇచ్చి ఉండాల్సింది.

విధాత‌: మనిషి ఉన్నప్పుడు విలువ తెలుసుకోక.. పోయాక అయ్యోపాపం అనే రోజులివి. ఆస్తి, అంతస్తులు అన్నీ ఉన్నా, అదే తంతు.. ఏమీ లేని వాడు విషయంలోనూ అదే తంతు అన్నట్టు ఉంది కాలం. ఎవరి గోల వారిదే అన్నట్టు ఉన్నాయి ఇప్పటి రోజులు. సామాన్యులనే కాదు.. సెలబ్రిటీల విషయంలోనూ అదే జరుగుతుంది. ఈమధ్యనే చనిపోయిన రాకేష్ మాస్టర్ విషయంలోనూ అదే జరిగింది. అతని పొడ గిట్టలేదు.. దూరం పెట్టారు. యూట్యూబ్‌లోనూ రచ్చ రచ్చ చేసి ఒదిలిపెట్టారు. ఎక్కడా సందు ఇవ్వలేదు. తీరా చనిపోయాకా ఇంత గొప్పవాడు పోయాడే అని వాపోతున్నారు.

రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత.. సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఒక్కరైనా పట్టించుకుని ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంతో భవిష్యత్ ఉండి ఎవరూ ఆదరించక కెరియర్ పాడు చేసుకున్నాడని, మద్యానికి బానిసగా మారాడని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. కెరీర్లో నిరాదరణకు గురికావడం, ముక్కు సూటితనం, ఉన్నది ఉన్నట్టు చెప్పే గుణం అతని ఎదుగుదలను అడ్డుకున్నాయనే చెప్పాలి. దీనినే రాకేష్ మాస్టర్ పరిశ్రమ తనకు అన్యాయం చేస్తుందనే ధోరణిలో చూడటం మొదలుపెట్టాడు. ఇదే అందరితోనూ విభేదాలకు దారి తీసింది.

ఎవరితోనూ కలవకుండా చేసింది. కెరియర్, కుటుంబం, నా అన్నవాళ్ళకు దూరంగా తరిమేసి, మద్యం అలవాటు జీవితాన్ని అంతం చేసుకునేలా చేసింది. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ సినీ ఇండస్ట్రీకి శేఖర్, జానీ, సత్య వంటివారిని అందించాడు.

కనీసం ఇప్పటి దర్శకులైనా రాకేష్ మాస్టర్‌కి అవకాశాలు ఇచ్చి ఉంటే అతన్ని కాపాడుకునేవాళ్ళు. ఎవరూ మేమున్నామనే స్నేహ హస్తాన్ని చూపించలేదు. కనీసం అతని గోడు వినేందుకు కూడా ఎవరూ రాలేదు. పలకరించలేదు. మాట్లాడిన దాఖలాలు కూడాలేవు. అలా వదిలేసి వినోదం చూశారంతే..

రాకేష్ మాస్టర్ చనిపోయాక అతని కుమారుడు ఇకపైనైనా నా తండ్రి గురించి చెడుగా మాట్లాడకండని మొరపెట్టుకోవడం అందరి మనసులను గుచ్చినట్లయింది. జీవితంలో వచ్చే ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలబడగలగాలి, ఎన్ని కష్టాలొచ్చినా నిలిచి గెలిచి చూపించాలి. ఇలా పిరికిగా మారితే మనతో ముడిపడిన కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయని పరుచూరి గోపాలకృష్ణ తన మనసులో మాటను పంచుకున్నాడు.