హైదరాబాద్ కు ప్రియాంక గాంధీ
విధాత: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రేపు తన కుమారుడు రైహాన్ సహా హైదరాబాద్‌కు రానున్నారు. రైహాన్ కంటి గాయానికి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించనున్నారు. నాలుగున్నారేండ్ల కిందట క్రికెట్ ఆడుతుండగా రైహాన్ కంటికి దెబ్బ తగిలింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. గతంలో హైదరాబాదులో చికిత్స పొందిన రైహాన్ ను మరోసారి తీసుకు వస్తున్నారు. చికిత్స అనంతరం రేపు […]

విధాత: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రేపు తన కుమారుడు రైహాన్ సహా హైదరాబాద్‌కు రానున్నారు. రైహాన్ కంటి గాయానికి హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించనున్నారు. నాలుగున్నారేండ్ల కిందట క్రికెట్ ఆడుతుండగా రైహాన్ కంటికి దెబ్బ తగిలింది. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
గతంలో హైదరాబాదులో చికిత్స పొందిన రైహాన్ ను మరోసారి తీసుకు వస్తున్నారు. చికిత్స అనంతరం రేపు సాయంత్రం ఢిల్లీ తిరుగు పయనం కానున్నారు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా దంపతులకు కమారుడు రైహాన్, కుమార్తె మిరాయా ఉన్నారు. రైహాన్ పూర్తి పేరు రైహాన్ రాజీవ్ వాద్రా. రైహాన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు