జాతీయ సమైక్యత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర: కుంభo

విధాత, యాదాద్రి భువనగిరి: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కన్యాకుమారి వరకు జాతీయ సమైక్యత కోసం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడు యాత్రను జయప్రదం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం అయన భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు. వడపర్తి నుంచి మన్నే వారి పంపు, కురుమ గూడెం, హనుమపురం భువనగిరి జిల్లా […]

జాతీయ సమైక్యత కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర: కుంభo

విధాత, యాదాద్రి భువనగిరి: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కన్యాకుమారి వరకు జాతీయ సమైక్యత కోసం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడు యాత్రను జయప్రదం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం అయన భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో రాహుల్ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు. వడపర్తి నుంచి మన్నే వారి పంపు, కురుమ గూడెం, హనుమపురం భువనగిరి జిల్లా కేంద్రానికి పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి సామరస్యాలతో ప్రజలు జీవించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీ అధికారంలోకి వచ్చి భారత దేశ యొక్క ఔన్యత్యని దెబ్బతీస్తుందని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే దేశంలో రాష్ట్రంలో అందరూ శాంతి సామరస్యంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు జరుగుతున్న అన్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా యావత్ దేశానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే సందేశాన్ని ఇవ్వడం కోసం చేపట్టినట్లు తెలిపారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఇలాంటి సమయంలో రాహుల్ గాంధీ చేపట్టే జోడో పాదయాత్రకు అందరూ సంఘీభావం ప్రకటించాలని, అందరు కలిసి రావాలని కోరారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు మద్దతుగా వాడపర్తిలో తాను పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

పడపర్తి గ్రామంలో మహిళా సమస్యలు ఇండ్ల సమస్యలు రోడ్డు సమస్యలపై స్థానిక ఎమ్మెల్సీ , జడ్పీ చైర్మన్ , ఎమ్మెల్యే ను నిలదీశారు. భువనగిరి ఎంపీ వెంకటరెడ్డి దత్తత గ్రామం తీసుకున్నారని సాగుతూ ఈ గ్రామానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇది ఏమైనా ప్రజల పక్షాన ప్రజా సమస్యల పక్షాన తాను పోరాటం చేయనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల తనకు హామీగా నిలబడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్లా ఐలయ్య, బీబీనగర్ మాజీ జెడ్పిటీసీ సంధిగారి బసవయ్య, మండల పార్టీ అధ్యక్షులు కోట పెద్ద స్వామి, పీసీసీ మాజీ కార్యదర్శి తంగెలపల్లి రవికుమార్, గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, నాయకులు జంగయ్య యాదవ్, నానం కృష్ణ, పిన్నం రాజు, గడ్డమీద వీరస్వామి గౌడ్, నాగయ్య యాదవ్, ఎడ్ల శ్రీనివాస్, భాస్కర్ గౌడ్, కాంగ్రెస్ మహిళ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.