గవర్నర్ వ్యవస్థ రద్దుకై 7న రాజభవన్ ముట్టడి: పల్లా వెంకట్ రెడ్డి

విధాత: కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను భయబ్రాoతులకు గురి చేస్తుందని గవర్నర్ వ్యవస్థ రద్దుకై డిసెంబర్ 7న సీపీఐ తలపెట్టిన రాజభవన్ ముట్టడికి అధిక సంఖ్యలో తరలిరావాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఐ నల్లగొండ జిల్లా కౌన్సిల్ సమావేశం పార్టీ కార్యాలయం మగ్దుం భవనంలో ఆదివారం నిర్వహించారు. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ […]

గవర్నర్ వ్యవస్థ రద్దుకై 7న రాజభవన్ ముట్టడి: పల్లా వెంకట్ రెడ్డి

విధాత: కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను భయబ్రాoతులకు గురి చేస్తుందని గవర్నర్ వ్యవస్థ రద్దుకై డిసెంబర్ 7న సీపీఐ తలపెట్టిన రాజభవన్ ముట్టడికి అధిక సంఖ్యలో తరలిరావాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఐ నల్లగొండ జిల్లా కౌన్సిల్ సమావేశం పార్టీ కార్యాలయం మగ్దుం భవనంలో ఆదివారం నిర్వహించారు. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ

ప్రజల ద్వరా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గవర్నర్ జోక్యం ఏమిటంటు ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను కొంతమంది గవర్నర్లు ముందుకు తీసుకుపోతున్నారని ఆరోపించారు. దేశంలో బీజేపీ మూడోసారి అధికారం రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దాని కోసం స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర సంస్థలను నిర్వీర్యం చేస్తూ వారి చెప్పు చేతిలో పెట్టుకొని రాష్ట్రాల లో విపక్షాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నయానా భయానా తమ వైపు తిపుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు.

ఆఖరికి గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తు తమిళనాడు, పుదుచ్చేరి , కేరళ, పశ్చిమబెంగాల్, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలను ఆమోదించకుండా నెలలు తరబడి బిల్లులు డ్రా చేయకుండా గవర్నర్ రాజభవన్‌లో పెండింగ్‌లో పెట్టుకుంటున్నారని ఆరోపించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం రావడం కోసం ఈడీలు, సీబీఐతో బెదిరింపులకు పాల్పడుతుందని విమర్శించారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ డిసెంబర్ 26న సీపీఐ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎర్రజెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సీపీఐకి పూర్వవైభం తీసుకొచ్చే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.

సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ అధ్యక్షత వహించగా, సీపీఐ సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు, పల్లా నరసింహారెడ్డి, ఉజ్జిని యాదగిరి రావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శిలు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి మందడి నర్సింహ రెడ్డి, గురుజ రామచంద్రం, టీ వెంకటేశ్వర్లు బంటు వెంకటేశ్వర్లు, అర్ అంజచారి, బోల్గురి నర్సింహ, గిరిరామ తదితరులు పాల్గొన్నారు.