రేవంత్ రెడ్డిని కలిసిన పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణా రెడ్డి
విధాత, నల్గొండ: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం పాల్వాయి స్రవంతిని ఎంపిక చేసిన నేపథ్యంలో ఆమె శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె వెంట టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణా రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్రవంతి అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిందని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు. సెప్టెంబర్ 18 నుంచి […]

విధాత, నల్గొండ: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం పాల్వాయి స్రవంతిని ఎంపిక చేసిన నేపథ్యంలో ఆమె శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె వెంట టికెట్ ఆశించిన చల్లమల్ల కృష్ణా రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్రవంతి అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిందని, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయం కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు. సెప్టెంబర్ 18 నుంచి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు.
వ్యాపారం కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని, మునుగోడులో కాంగ్రెస్ మిగతా పార్టీల కంటే ముందే ప్రచారాన్ని అభ్యర్థిని ప్రకటించిందని ఇప్పటికీ బీజేపీ, టీఆర్ఎస్‌లు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదని గుర్తు చేశారు. ఆ రెండు పార్టీలకు మునుగోడు ప్రజలుఈ ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు.