Viral news | అర్ధరాత్రి ఇంట్లోకి దొంగ.. శృంగారంలో దంపతులు.. తర్వాత ఏం జరిగిందంటే..!
Viral news | అది అర్ధరాత్రి సమయం..! ఒక దొంగ దొంగతనం కోసం ఒక ఇంట్లో దూరాడు..! హాల్లోకి దూరిన దొంగ తలుపు సందులోంచి బెడ్‌రూమ్‌లోకి చూడగా.. దంపతులిద్దరూ శృంగార క్రీడలో లీనమై ఉన్నారు..! అంతే ఆ దొంగ దొంగతనం ఆలోచన విరమించుకున్నాడు. తన మొబైల్ ఫోన్‌లో రహస్యంగా ఆ దంపతుల శృంగార క్రీడను చిత్రీకరించాడు. వీడియో తీసుకున్న తర్వాత ఏమీ ఎరగనట్టుగా తిరిగి వెళ్లిపోయాడు.
Viral news : అది అర్ధరాత్రి సమయం..! ఒక దొంగ దొంగతనం కోసం ఒక ఇంట్లో దూరాడు..! హాల్లోకి దూరిన దొంగ తలుపు సందులోంచి బెడ్‌రూమ్‌లోకి చూడగా.. దంపతులిద్దరూ శృంగార క్రీడలో లీనమై ఉన్నారు..! అంతే ఆ దొంగ దొంగతనం ఆలోచన విరమించుకున్నాడు. తన మొబైల్ ఫోన్‌లో రహస్యంగా ఆ దంపతుల శృంగార క్రీడను చిత్రీకరించాడు. వీడియో తీసుకున్న తర్వాత ఏమీ ఎరగనట్టుగా తిరిగి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఆ ఇంటి యజమాని ఫోన్ నెంబర్ సంపాదించి.. తాను చిత్రించిన వారి శృంగార వీడియోను వాట్సాప్‌లో పంపించాడు. తమ ఇంట్లో, తమ పడకగదిలో జరిగిన శృంగారాన్ని బయటివ్యక్తి చిత్రించి తమకే వాట్సాప్ చేయడంతో వారు షాకయ్యారు. ఇదిలావుంటే తనకు వెంటనే రూ.10 లక్షలు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడుతానని దొంగ బెదిరించాడు.
అతని బెదిరింపులకు లొంగని దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతని ఫోన్ నెంబర్, లొకేషన్ ఆధారంగా దొంగను పట్టుకున్నారు. ఛత్తీగఢ్‌లోని దుర్గ్ పట్టణంలో ఇటీవల జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే వివాహం చేసుకున్న 28 ఏళ్ల వ్యక్తి, అతని భార్య ఏకాంతంగా ఉన్న ఇంట్లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
కాగా ప్రభుత్వ ఉద్యోగమే తన లక్ష్యమని, అయితే ఎన్ని పరీక్షలు రాసినా ఉద్యోగం రాకపోవడంతో దొంగతనాల బాటపట్టానని ఆ దొంగ పోలీస్ విచారణలో చెప్పినట్లు క్రైం బ్రాంచ్ డీసీపీ ప్రకాష్ నాయక్ తెలిపారు. గతంలో కూడా స్థానికంగా తాను చాలా దొంగతనాలు చేశానని అతను ఒప్పుకున్నాడని, దొంగ పేరు వినయ్‌కుమార్ సాహుగా గుర్తించామని ఆయన చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram