తెలంగాణ: యాసంగిలో వ‌రి సాగు చేయొద్దు.. సీఎస్ సోమేశ్ కుమార్

విధాత : తెలంగాణ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హిం చారు. ఈ స‌మావేశానికి క‌లెక్ట‌ర్లు, సీపీలు, ఎస్పీలు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, ఇత‌ర అంశాల‌పై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోకూడదని కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయని రాష్ట్రంలో రైతులు యాసంగి వ‌రి పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ఈ క్ర‌మంలో […]

తెలంగాణ: యాసంగిలో వ‌రి సాగు చేయొద్దు.. సీఎస్ సోమేశ్ కుమార్

విధాత : తెలంగాణ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హిం చారు. ఈ స‌మావేశానికి క‌లెక్ట‌ర్లు, సీపీలు, ఎస్పీలు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, ఇత‌ర అంశాల‌పై చర్చించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోకూడదని కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయని రాష్ట్రంలో రైతులు యాసంగి వ‌రి పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలంగా ఉన్నారని తెలిపారు.

ఈ క్ర‌మంలో రైతులు యాసంగిలో వ‌రి సాగు చేయొద్దు అని సూచించారు. విత్త‌న కంపెనీలు, మిల్ల‌ర్ల‌తో ఒప్పందాలున్న వారు వ‌రి వేయొచ్చు అని పేర్కొన్నారు. ఇప్పుడు 40 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బియ్య‌మే కొంటామ‌ని కేంద్రం చెప్పిందన్నారు.

ఐతే ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాలని అవ‌స‌ర‌మైన చోటు కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా ధాన్యం వ‌స్తున్న‌ట్టు తెలుస్తోందన్నారు.

ఇత‌ర రాష్ట్రాల ధాన్యం రాకుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలని ధాన్యాన్ని బియ్యంగా మార్చే మిల్లింగ్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయాలని సీఎస్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.