తెలంగాణ: పోలీసులను ఏంట్రా అన్న ఎమ్మెల్యే .. ఎదురు తిరిగిన పోలీసులు (వీడియో)
మరోసారి కాంట్రవర్శిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విధాత: సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నాం మహబూబ్ నగర్ వెళ్లారు. ఇటీవల మరణించిన మం త్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దినకర్మకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం.. శాంతమ్మ సమాధి వద్ద ఆమెకు నివాళులర్పించి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని పరామర్శించారు. అయితే శాంతమ్మ సమాధి వద్దకు వెళ్లేందుకు కేవలం సీఎం కేసీఆర్ వాహనానికి మాత్రమే అనుమతి ఉండడంతో మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా వారికి కేటాయించిన పార్కింగ్ […]

మరోసారి కాంట్రవర్శిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
విధాత: సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నాం మహబూబ్ నగర్ వెళ్లారు. ఇటీవల మరణించిన మం త్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దినకర్మకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం.. శాంతమ్మ సమాధి వద్ద ఆమెకు నివాళులర్పించి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని పరామర్శించారు.
అయితే శాంతమ్మ సమాధి వద్దకు వెళ్లేందుకు కేవలం సీఎం కేసీఆర్ వాహనానికి మాత్రమే అనుమతి ఉండడంతో మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో వాహనాన్ని పార్క్ చేసి సమాధి వద్దకు నడుచుకుంటూ వెళ్లాలి. అందరూ నిబంధనలు ప్రకారమే నడుచుకున్నారు..
కానీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాత్రం తన వాహనాన్ని సమాధి వరకు వెళ్లేలా అనుమతి ఇవ్వాల ని పోలీసులను కోరారు. పోలీసులు మాత్రం నిబంధనలు కు విరుద్ధంగా వ్యవహరించలేమని మర్యా దపూర్వకంగా చెప్పడంతో బాలరాజు నిస్సహాయ స్థితిలో మాటల మధ్య పోలీసు అధికారులను ఏంట్రా అని నోరు జరారు..
అంతే పోలీసు అధికారులు యం.ఎల్.ఏ బాలరాజుకు ఏంట్రా అంటారా మీరు అధికారులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ చుక్కలు చూపారు.. తర్వాత బాలరాజు చేసేది ఏమి లేక తన అనుచరులతో కాలి నడకన సమాధి వద్దకు చేరుకున్నారు.